సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు కు భీమవరం పట్టణంలో గత వారంరోజులుగా అన్ని వర్గాలవారు, వర్తక, వాణిజ్య, కార్మిక, కుల సంఘాలు, స్వచ్చంధ సంఘాలు ఘన నివాళ్లు అర్పిస్తూ ,,పట్టణానికి ఆయన చేసిన సేవలు కొనియాడుతూ..వాడవాడలా సంతాప సభ లు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, బుధవారం భీమవరం మండలాల లైటింగ్ సౌండ్స్ ఫ్లవర్ డెకరేషన్ సంఘం వారు భీమవరం పట్టణం ఇండస్ట్రియల్ ఏరియా లో దివంగత గ్రంధి వెంకటేశ్వరరావు సంతాప సభ నిర్వహించారు. ఒక నిమిషం మౌనం పాటించి అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే నేడు, బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం వారు. మరియు స్వర్ణకార సంఘం వారు. సంతాప సభ నిర్వహించారు జోహార్ జి వి ఆర్ జోహార్ జి వి ఆర్ అంటూ నివాళ్లు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *