సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో దివ్యంగ రాష్ట్రీయ సేన సమితి 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులను ఆదరించడం మానవ ధర్మమని,దివ్యంగులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జిల్లా దివ్యాంగుల శిశు సంక్షేమ వయో వృద్ధుల శాఖ చైర్మన్ ముంతాజ్ పఠాన్ బేగం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల్లో దివ్యంగ శాఖ అధికారులను సచివాలయలలో నియమించారని అన్నారు . కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోతే ధర్నాలు, రాస్తారోకో లు చేయడం ధర్మం కాదన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కేతా శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎస్ కే నూర్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సంతృప్తి కరంగా ఉన్నాయని అన్నారు. చిత్తూరు జేఏసి కన్వినర్ మాధవ, రాష్ట్ర నాయకులు బాలు వర్ధన్, న్యాయ సహాయదారులు డికే ప్రకాష్, యాళ్ళ పెద్దిరాజు, కే హనుక్ లు ప్రస్తుతం దివ్యాంగులు సమస్యలను సభలో వెల్లడించారు. అనంతరం వికలాంగులకు సేవలందిస్తున్న వారిని సత్కరించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, మంతెన లక్ష్మి పతిరాజు, తదితరులు పాల్గొన్నారు.
