సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటేలా రంగురంగుల కాంతులతో ( ఫై చిత్రంలో) రాత్రి మనోఉల్లాసంగా పండుగ జరిగింది. నేటి గురువారం రాత్రి 7గంటల కల్లా ఇంటింటా పుష్ప విద్యుత్ దీప అలంకారాలతో, శ్రీ లక్ష్మి పూజలు తో పాటు అందమైన దీపపు వెలుగులు కొలువు దీరాయి. నూనె ధరలు పెరిగిపోవడం పామాయిల్ కొరత ఉండటంతో గతంలో కన్నా కాస్త దీపాలు వెలుగులు తగ్గాయి. పెద్దలు చిన్నారుల కోలాహలంతో..మార్వాడీలు, బెంగాలీలు ఇళ్ళు లక్ష్మి కళతో మిఠాయిల పంపిణీలతో మరింత సందడిగ ఉన్నాయి. ఇక బాణాసంచా కాల్పులు తో ఆకాశం రంగు రంగుల కాంతుల అలంకారాలతో ప్రత్యక శోభ తో కనపడింది. ఆర్థికంగా బలమైన వర్గాలు ఉన్న ప్రాంతం కాబ్బటి రాత్రి 10 గంటల వరకు తగ్గేదే లే.. అన్న రీతిలో వేడుకలు నిర్వహించారు. దీపావళి ముందు రోజు వరకు పడ్డ వర్షాలు నేడు పడకపోవడంతో అన్ని రకాల వ్యాపారులతో పాటు బాణాసంచా వ్యాపారులు ఊపిరి తీసుకొన్నారు. బాణాసంచా ధరలు కూడా భారీగా పెరిగిపోవడం లేదా మార్కెట్ లో డబ్బు లేకపోవడం వల్లనో ఏమో గతం స్థాయి వ్యాపారం జరగలేదనే చెప్పాలి. పట్టణంలోని పలు దేవాలయాలు తో పాటు సాయంత్రం, శ్రీ స్వర్ణ సాయి మందిర్, మారుతి సెంటర్ లోని శ్రీ బాబావారి మందిరాలలో దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేసారు. నేడు, గురువారం కూడా కావడంతో అన్ని సాయి మందిరాల వద్ద భక్తుల దీపారాధనలు కోలాహలం ఎక్కువగా కనపడింది.
