సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 3 ఏళ్ళ నిరీక్షణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర: పార్ట్-1; నేడు శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులలో జోష్ అంతా ఇంతా కాదు.. ఈ నేపథ్యంలో భీమవరంలో గత గురువారం సాయంత్రం నుండి ఎన్టీఆర్ అభిమానాలు చేస్తున్న సందడి అంత ఇంతా కాదు.. పట్టణ వీధుల గుండా కేరింతలతో భారీ సంఖ్యలో అభిమానులు మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు . గత అర్ధరాత్రి .. నేటి తెల్లవారు జాము వంటి గంటకల్లా భీమవరంలో 11 తెరలపై దేవర సినిమా రిలీజ్ కావడం తెల్లవారు జాము 4న్నర గంటలకు 8 తెరలపై దేవర హోస్ ఫుల్ తో ప్రదర్శింప బడటం జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న భారీ మాస్ పాలోయింగ్ కు నిదర్శనం.. భీమవరం పట్టణంలో నేడు ఒక్క రోజు సుమారు 60 షోస్ ప్రదర్శించి సుమారు 50 లక్షల రూపాయలు పైగా కలెక్షన్ సాధించే అవకాశం స్వష్టంగా కనపడుతుంది. టాక్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అదుర్స్.. సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది.. అయితే యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకులకు దేవర పండుగే అంటున్నారు.
