సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ నందు గల చెరువులో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారిణి డాక్టర్ గీతాబాలి, గంబూసియా చేపలను నీటి లోకి విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ.. దోమలు ద్వారా సంక్రమించే మలేరియా డెంగీ , చికెన్ గున్యా మరియు ఫైలేరియా వ్యాధులను అరికట్టటం లో భాగంగా దోమలు లార్వా మరియు ప్యూపాలను రోజుకు 100-200 తినే గంబూసియా చేప ఉపయోగ పడుతుంది. ఇది జీవ సంబంధ నియంత్రణ లో ముఖ్యమైది. ఈ కార్యాక్రమాన్ని ఉద్దశించి DMHO మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలి అని ఇంటి పరిసరాల లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని ముఖ్యం గా వర్షాకాలం లో ‘ప్రై డే- డ్రై డే’ కార్యక్రమం లో ప్రతి ఇంటి నందు వర్షపు నీరు ఉన్న పాత్రులు నీరు లేకుండా చేసి లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్త వహించాలి అని ఎవరికి అయినా జ్వరం మొదలుఅయిన అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆశా మరియు ఆరోగ్య కార్యకర్తని సందర్శించాలి అని సూచించారు. ఈ కార్యాక్రమములో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ క్రాంతి కుమార్ జిల్లా ఉప మలేరియా అధికారి వై నాగబాబు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *