సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అవినీతి కేసులలో అరెస్ట్ చేసారని ఆరోపిస్తూ జగన్ సర్కార్ కు విభిన్న నిరసనగా గత ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన సెంటెర్స్లో టీడీపీ నేతలు నల్లరిబ్బన్‌లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా కేంద్రం భీమవరంలో గాంధీ బొమ్మవద్ద జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు , మాజీ కౌన్సెలర్స్ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్లనాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ.. వైసిపి ఒక ప్యూహం ప్రకారం చంద్రబాబు ఫై అక్రమ కేసులు వేసి ఆయన ఎన్నికల ప్రచారంలోకి రాకుండా కుట్ర చేస్తుందని .. చంద్రబాబు కు భయపడి వైసిపి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రజలకు వాస్తవాలు తెలుసునని అన్నారు. ఉండి నియోజక వర్గం చిన్నపుల్లేరులో ఎంఎల్‌ఎ, రామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు నల్ల రిబ్బన్‌లతో కళ్లకు గంతలు కట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.
