సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గౌరవ3వ అధనపు జిల్లా న్యాయమూర్తి పి. సత్యాదేవి లోక్ అదాలత్ నిర్వహణ ఫై సమీక్షా సమావేశాన్నినేడు, శనివారం భీమవరం కోర్ట్ అవరణలో నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం లో చివరిది గా నవంబర్ 12 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో మోటార్ యాక్సిడెంట్స్ కి సంభందించిన ప్రమాద భీమా కేసులు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ మరియు ట్రాన్స్ పోర్ట్ కి సంభందించిన కేసులు, ప్రీ లిటిగేషన్ కేసుల ద్వారా కూడా బ్యాంక్ కేసులు,ఆయా కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ బ్యాంక్ లకు సంంధించిన కేసులు పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై సంభందిత అధికారులతోను, న్యాయవాదులతో చర్చించారు. తక్కువ సమయంలో ఇరు పక్షాల వారికి సమన్యాయం అందించే జాతీయ లోక్ అదాలత్ ను కేసులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తులు బి. అప్పల స్వామి, డి. సోని, న్యాయవాదులు ఎన్ సత్యనారాయణ,పి .నరసింహం, శంకర్ శాస్త్రి, ఎన్ . జనార్థన్, ఆమిరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మనేజర్ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *