సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు,శనివారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు మహిళలు భక్తులతో భారీ క్యూ లైన్ లతో కిటకిటలాడాయి. స్థానిక పంచారామ శ్రీ సోమేశ్వర దేవాలయం, శ్రీ భేమేశ్వర స్వామి, శ్రీ రాంపురం లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో, మారుతి సెంటర్ లోని శ్రీ సుబ్రమణ్య దేవాలయాలలోను, విష్ణు కాలేజీ రోడ్డులోని , నరసయ్య ఆగ్రహం ఉండి రోడ్డులోని పలు పాము పుట్టలు వద్ద మహిళలు విశేషంగా పూజలు నిర్వహించి ఆవు పాలు సలివిడి ,నువ్వుల చిమిలి ఉండలు.. పెసరపప్పు సమర్పించారు. గునుపూడి పంచా రామంలో అయితే కార్తీక మాస నేపథ్యంలో మరింత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సుమారు 5వేలమంది భక్తులు హాజరు అవుతున్నారు. దర్శన టికెట్స్ ఇతరత్రా పూజలు టికెట్స్ ఫై 22, 306 రూపాయలు అన్నసమారాధన కానుకలు కలిపి నేడు ఒక్కరోజు 71,481 రూపాయలు ఆదాయం వచ్చింది. స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాలలోను నాగుల చవితి శ్రీ నాగేంద్ర స్వామికి మహిళలు విశేష పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *