సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు,మంగళవారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు భక్తులతో భారీ క్యూ లైన్ లతో కిటకిటలాడాయి. విష్ణు కాలేజీ రోడ్డులోని , నరసయ్య ఆగ్రహం ఉండి రోడ్డులోని పలు పాము పుట్టలు వద్ద మహిళలు విశేషంగా పూజలు నిర్వహించారు. శ్రీ రాంపురం లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం పునర్ నిర్మాణం లో ఉన్న నేపథ్యంలో బయట ఏర్పాటు చేసారు. గునుపూడి పంచా రామంలో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక దీపారాధనలతో ఆలయ పరిసర ప్రాంతాలు తెల్లవారు జామునుండి వెలుగులతో నిండిపోయాయి. స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాలలోను నాగుల చవితి శ్రీ నాగేంద్ర స్వామికి మహిళలు నువ్వుల ఉండలు, చలివిడి, ఆవు పాలు, తెగలు, నీటిలో నానిన పెసరపప్పు భక్తి శ్రద్దలతో సమర్పించారు. అన్ని దేవాలయ ఆవరణాలలో కార్తీక దీపారాధన శోభా కనిపించింది. మహిళలు తమ కుటుంబ ఆరోగ్యం, వంశ అభివృద్ధి , శ్రేయస్సు కోరుకొంటూ పూజలు చేసారు.
