సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో తాజగా’నూట్రి .. ఫుడ్ ఫార్మసీ’ ప్రారంభించబడింది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన G V S K సంస్థ వారి అధిక మోతాదులో ఔషధ గుణాలు కలిగిన ఫుడ్ సప్లిమెంట్స్ ను భీమవరం ప్రజలకు పరిచయం చేసి చాల తక్కువ ఖర్చు తోనే సునాయాసంగా వారికున్న అనారోగ్య సమస్యల నుండి బయట పడవేసి సంపూర్ణ ఆరోగ్యం కలిగించే ఉద్దేశ్యంతో ‘ నూట్రి .. ఫుడ్ ఫార్మసీ’ ని భీమవరం వన్ టౌన్ ఆదివారం బజారు లోని భీమేశ్వర స్వామి గుడి రోడ్డులో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. జి వి ఎస్ కే సంస్థ వారి పకృతి సిద్దమైన ఆహార ఉత్త్పతులకు సంబంధిత ప్రఖ్యాత ఆరోగ్య సంస్థల నుండి అనుమతులు కలిగి ఉందని తెలిపారు. ఇక్కడ కు వచ్చిన రోగులకు ముందుగా బీపీ, షుగర్, అజీర్ణం వంటి ఇతరాత్ర సమస్యలకుఆధునిక పరికరాలతో ఉచిత పరీక్షలు చేసి వారి స్థాయిలను నిర్ధారించి ఔషధ గుణాలు కలిగిన ఫుడ్ సప్లిమెంట్స్ ను అందించడం జరుగుతుందని.. వాటి వాడకంతో వారికీ ఎటువంటి సైడ్ ఎఫిక్ట్స్ లేని ఆరోగ్య స్వస్థత పొందవచ్చునని అన్నారు.ఆరోగ్య రక్షణకు మిలెట్స్ , సాంప్రదాయ తృణ ధాన్యాల వినియోగం, వ్యాయామం , యోగ పద్దతులు ఫై అవగాహన కల్పిస్తామని అన్నారు.’ భీమవరం ప్రజలు అధిక లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోసం ప్రారంభించబడిన స్థానిక నూట్రి .. ఫుడ్ ఫార్మసీ‘ ని సందర్శించి మీ ఆరోగ్యం పరిరక్షణ కు ప్రాధాన్యం ఇవ్వాలని “ఆహారమే ఔషధం‘ అన్న వాస్తవాన్ని ప్రోత్సహించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *