సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో నేటి శుక్రవారం రాత్రి నుండి అన్ని ప్రాంతాలలో శుభకార్యక్రమాలు, పెళ్లి సందడి వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. నేటి రాత్రి నుండి శుభ గడియలు తెచ్చిం ది. గత అక్టోబరు చివరలో శుభకార్యా లకు కొంత విరామం రావడంతో మరలా నేటి నుండివరుసగా రేపు 3, 4, 5, 6, 7, 8 తేదీల్లోనూ మంచి పెళ్లి ముహూర్తాలు వరుసగా ఉన్నా యి. ఈ నెల 11, 12 తేదీలు గృహ ప్రవేశాలకు అనువుగా ఉన్నాయి. వీటి తర్వా త 14, 16, 17, 18 వరకు వరుసగా మంచి పట్టు ఉన్న పెళ్లి ముహూర్తాలున్నాయని, తర్వాత కూడా మంచి రోజులు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది జనవరి 23న మాఘ మాసం వచ్చే వరకు నక్షత్రాలు బట్టి పెట్టుడు ముహుర్తాలుతో పెళ్లి సందడులకు కొదవులేదనే చెప్పాలి. ఇక జిల్లా రాజధాని భీమవరంలో అయితే పురోహితుల నుండి పంక్షన్ హాలు వరకు ఫుల్ డిమాండ్ .. ఈ 2 నెలలు వందలాది పెళ్లిళ్లు.. లక్షలలో ఖర్చు.. కొన్ని పెళ్లిళ్లు అయితే అనధికారికంగా కోట్ల రూపాయల ఖర్చు చేరిన తగ్గేదేలే .. అంటున్నారు మరి. మంచి ముహర్తన మంచి పంక్షన్ హాలు కు ఒక్కరోజుకు 5 నుండి 10 లక్షలు లో అద్దె చెల్లిస్తామన్న కూడా అందుబాటులో లేవు. అటువంటి ముహుర్తాలు మరి.. ఏది ఏమైనా ఈ 3 నెలల శుభకార్యక్రమాల సీజన్ ఎందరికో ఉపాధి లభిస్తుంది అన్న మాట వాస్తవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *