సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం నుండి సీఎం జగన్ ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సంబంధించి భీమవరం లో నేడు, మంగళవారం మధ్యాహ్నం 4గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కు భారీ ఏర్పాట్లు చేసారు. సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు ఉండి రోడ్డు నుండి బై పాస్ రోడ్డు ను కలుపుతున్న ప్రాంతాలలో ఉన్న జిడ్డు బ్రహ్మజీ కళ్యాణ మండపం వద్ద భీమవరం వైసీపీ శ్రేణులు సీఎం జగన్ కు స్వాగతం పలుకుతారు. అక్కడే కొద్దీ సేపు సమీక్షలు నిర్వహించినతరువాత అక్కడినుండి బయలు దేరి గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లోని సభ వేదిక వద్దకు చేరుకొంటారు. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ఉంగుటూరు నియోజకవర్గం లోని చిలకం పాడు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని రావిపాడు వద్ద, నేటి రాత్రి, బహిరంగ సభ లో పాల్గొంటారు. తదుపరి రేపు 17వ తేదీ బస్సు యాత్ర తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. దీనికి సంబం దిం చి అధికారులు నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం ఇప్పటికే ట్రయిల్ రన్ నిర్వహించారు.
