సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం జనసేన పార్టీ కార్యాలయం తెలియజేసిన సమాచారం మేరకు నేడు, బుధవారం సాయంత్రం 7:00 గ.లకు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్థానిక భీమేశ్వర స్వామి గుడివద్ద ఉన్న కొటికలపూడి గోవిందరావు (చినబాబు ) కార్యాలయానికి రానున్నారు. నేటి రాత్రి స్థానిక, జిల్లాలో రాజకీయ పరిస్థితులపై జనసేన పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. ఇక రేపు గురువారం తేది 27-04-2023 ఉ.09:30 గ.లకు భీమవరం 3 టౌన్ లోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి శ్రీ వేంకట సాయిబాబా వారి వార్షికోత్సవ వేడుకలకు అయన హజరవుచున్నారు.జనసేన రాష్ట్ర నేత , షిర్డీ సాయి దేవాలయ నిర్వాహకుడు మల్లినేడి బాబ్జి ఆహ్వానం మేరకు నాదెండ్ల మనోహర్ బాబావారి కార్యక్రమానికి హాజరు కానున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *