సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నూతన సంవత్సర వేడుకలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొత్త బస్సు స్టాండ్ వద్ద ఉన్న గ్రంధి వారి ఇల్లు దాని ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలో వేడుకల కోలాహలం..నిజానికి గత 3 న్నర దశాబ్దాల నుండి గ్రంధి వారి ఇంట, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తండ్రి స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు భీమవరం చైర్ పర్సన్ గా చేస్తున్నప్పటి నుండి ఒక సంప్రదాయం’గా వారి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా వేలాది మంది అక్కడకు చేరుకొని చేసే సందడి ప్రతి నూతన ఏడాది కొనసాగుతూనే ఉంది. నేటి గురువారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11 గం. దాటిన ఎడతెగని ప్రజలు క్యూ లైన్ లో నిలబడి..ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న గ్రంధి శ్రీనివాస్ ను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అదే చిరునవ్వు పలకరింపులతో ప్రజల నుండి శుభాకాంక్షలు అందుకొనే పనిలో గ్రంధి ఉన్నారు. మన సిగ్మా వీక్షకుల కోసం2026 ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ( ఫై తాజా చిత్రంలో )నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో మరింత అభివృద్ధి సాధించాలని గ్రంధి శ్రీనివాస్ అన్నారు..వచ్చిన వేలాది మందికి భారీ షమియానా టెంట్లలో ఎప్పటిలానే టిఫిన్, బిర్యానీ భోజన ఏర్పాట్లు చేసారు. గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ వచ్చిన నేతలను, కార్యకర్తలను పలకరిస్తూ సందడిగా గడిపారు.
