సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పురాణ ప్రసిద్ధి పొందిన పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం రానున్న దసరా మరియు పవిత్ర కార్తీక మాస మహోత్సవాలకు కొత్త కాంతులతో సిద్ధం అవుతుంది. దేవాలయ మండపమునకు మరియు దేవాలయ గోపురములకు కొత్తగా రంగులు వేసే కార్యక్రమం దేవాలయ కార్య నిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అమ్మ రాజా సుమారుగా 8 లక్షల రూపాయలు విలువైన రంగులు సమకూరుతున్నారని ఇవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *