సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ క్షేత్రం లో పరమేశ్వరుని పాదాల చెంత సేవా చేయడమంటే ఎంతో మహాభాగ్యామేనని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. తెలుగునాట 5 పంచారామ క్షేత్రల లో ఒకటైన భీమవరం శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం నూతన ధర్మ కర్తల మండలి సభ్యులు నేడు, సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థాన చైర్మన్ గా చింతలపాటి బంగార్రాజు, సభ్యులుగా బ్రహ్మజ్యోసుల సత్య ప్రసాద్, బొచ్చ కృష్ణవేణి, పడమటి లీలా కుమారి, కృష్ణపాల వెంకట రామ, నాగేంద్ర విజయ లక్షీకుమారి సాయి, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పోతునూరి శ్యామ్, పెద్దింటి జ్యోతిమయి, కొప్పర్తి విజయ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. స్థానికులతో పాటు ఎంతో దూరప్రాంతాల నుండి కార్తీకమాసం, శివరాత్రి మహోత్సవాలతో పాటు రోజు వచ్చే భక్తులకు పాలకవర్గ సభ్యులు మెరుగైన సేవలను అందించాలని, వారికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ బంగార్రాజు మాట్లాడుతూ..శ్రీ సోమేశ్వరుని దయతో మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో,డీ రామకృష్ణంరాజు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *