సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం నియోజకవర్గంలో డేగపురం, చాగల్లు, వెంప,పాలకోడేరు ఉండి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు మహా రంజుగా భారీ టెంట్లలో అతిధి మర్యాదలతో ఇండోర్ స్టేడియాలను తలపిస్తూ రాయల్ లుక్ టెంట్ ల లో భారీ ఎల్ ఈ డి తెరల పై ప్రదర్శిస్తూ నిర్విఘ్నంగా నేటి సోమవారం మధ్యాహ్నం నుండి జోరుగా ప్రారంభమయ్యాయి. వాటిలో పలు సాంప్రదాయ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అతిధులకు , వి ఐ పి లకు విందులు వినోదాలు ప్రారంభమయ్యాయి. అయితే పలువురు ప్రజా ప్రతినిధులు విందులు వినోదాలకే పరిమితం అయ్యారు. వీటికి బోనస్ గా రెస్టారెంట్ లు, గుండాట, కోతాట వంటి వ్యసనాల జోరు సాధారణంగానే జరిగిపోయింది. కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారుతుంది. అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాలలో పోలీసులు దాడులు చేసిన ఘటనలు కూడా జరిగాయి.నరసాపురంలోని పామాయిల్ తోటలో బరు లు సిద్ధం చేయడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవ రం, రాజవరం గ్రామాల్లో కోడిపందేల బరు లను ధ్వంసం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం, శ్రీనివాసపురం గ్రామా ల్లో కోడిపందేల నిర్వహణకు సిద్ధం చేసిన బరులను జేసిబిలతో ముందే ధ్వంసం చేశారు
