సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో వార్డుల వారీగా అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆమోదం పొంది టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎక్కడెక్కడ పనులు ప్రారంభించాల్సి ఉంది? ఆలస్యలకు కారణాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. పట్నంలో ప్రతి వార్డుల లో ప్రజల కోరిక మేరకు మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ఇటీవలే కొన్ని పనులకు ప్రతిపాదన లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, త్వరలోనే ఆమోదం వస్తుందని, అనంతరం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మరిన్ని అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తొందరలోనే పట్నంలో సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏ మేర లబ్ధి జరిగింది అనే దానిపై కూడా వివరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, ఎం ఈ త్రినాధరావు, డి ఈ రాజారావు ,ఏఈ శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
