సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణములో ఆస్థి పన్ను అడ్వాన్స్ గా చెల్లిస్తే గత బకాయిలపై వడ్డీ రద్దు చేస్తామని ఆఫర్ ప్రకటించినప్పటికీ , అనుకున్న స్థాయిలో పన్ను వసూళ్లు కాకపోవడంతో రేపు గురువారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. స్థానిక మున్సిపల్ పన్నులు బకాయిలు వసూళ్ళు చేసేందుకు కమీషనర్ ఎస్ శివరామకృష్ణ నేడు, బుధవారం స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మునిసిపల్ రెవిన్యూ అధికారి D.సోమ శేఖర్ యాదవ్, ACP P.గౌరు, మునిసిపల్ RI కృష్ణ మోహన్, ఇంజనీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ సిబ్బంది ఒక టీం గా ఏర్పడి పట్టణములో ప్రత్యెక డ్రైవ్ చేపట్టారు ఇందులో భాగంగా 21అపార్ట్మెంట్ లకు సంబంధించి నీటి పన్ను బకాయి వసూళ్ళకు చర్యలు తీసుకున్నారు కొన్ని అపార్ట్మెంట్ లకు తన సిబ్బంది సహకారంతో కుళాయి కనెక్షన్ లు తొలగించారు. ఆ అపార్ట్మెంట్స్ వారు దాదాపు 30 లక్షల రూపాయలు వరకు చెల్లించవలసి ఉందని అధికారులు తెలిపారు ఇందులో ఇరువురు యజమానులు అక్కడి కక్కడే బకాయిలు చెల్లించడంతో కుళాయి కనెక్షన్ ల తొలగింపు నిలిపివేశారు. సంబందిత యజమానులకు బకాయిలు వెంటనే చెల్లించాలి అని అట్లు లేనిచో కఠిన చర్యలు తీసుకుంటాం అని మునిసిపల్ కమీషనర్ హెచ్చరించారు. కుళాయి పన్నులు చెల్లించని వారిపై కుళాయి కనెక్షన్ లు తొలగించేందుకుఇక నుండి ప్రత్యెక టీంలు యదావిధిగా పనిచేస్తాయి అని హచ్చరించారు, రేపు శ్రీరామ నవమి సందర్భంగా సెలవు అయినప్పటికీ ఆస్తి పన్ను చెల్లింపుకు సంబంధించి మునిసిపల్ ఆఫీస్ లో ప్రత్యెక కౌంటర్ లు ఏర్పాటు చేసారు. దీనితో పాటుగా పట్టణములోని 39 వార్డ్ సచివాలయాల్లో ప్రత్యెక కౌంటర్ లు పనిచేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *