సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికార వ్యామోహం లేకుండా దేశం కోసం ధర్మం కోసం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పని చేసే నాయకత్వం బిజెపి ఆస్తి అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బిజెపి పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తన నివాసంపై బిజెపి పార్టీ జెండా ఎగురవేశారు అనంతరం భీమవరంలోని బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో శ్రీరామనవమి, బిజెపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. బిజెపి జెండా ఎగరవేసి కమలం గుర్తుకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాలాభిషేకం చేశారు. ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా స్తూప ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బలియశక్తిగా బిజెపిని తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయి దే అన్నారు. స్వార్థం లేని లక్షలాదిమంది స్వయం సేవకులు, కార్యకర్తల కృషి, మోడీ నాయకత్వం వల్లే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
