సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం ఉదయం భీమవరం సుంకర పద్దయ్య గారి వీధిలోఘనంగా నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు , స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని భక్తులకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రాంత ప్రజలకు శ్రీ అమ్మవారి అస్సిసులు సర్వదా ఉండాలని ఆకాంక్షించారు, తదుపరి భీమవరం పట్టణం తాడేరు రోడ్ AP tidco కాలనీ లో జరిగిన గునుపూడి గ్రామదేవత శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి జాతర లో శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు పాల్గొని భక్తులకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి భీమవరం త్యాగరాజ భవన్ లో జరిగిన ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు, ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా వీరిరువురు పట్టణంలోని పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
