సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు భీమవరంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఉదయం స్థానిక రెస్ట్ హౌస్ రోడ్ శంకర మఠం వద్ద గల శ్రీశ్రీశ్రీ గంగానమ్మ గుడివద్ద ప్రత్యక పూజలలో పాల్గొని స్థానిక యువతతో కలసి అన్న సమరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి . DCMS చైర్మన్, వేండ్ర వెంకట స్వామి చే జువ్వల పాలెం రోడ్ భీమవరం లో ఏర్పాటు చేసిన DCMS వారి దీపావళి బాణా సంచా షాప్ ను కొయ్యే మోషేను రాజు మరియు DCCB చైర్మన్ PVL నర్సింహ రాజు సంయుక్తంగా ప్రారంభించారు. తదుపరి భీమవరం జేపీ రోడ్ లోని రాధా కృష్ణ కన్వర్షన్ సెంటర్లో జరుగుచున్న అక్వా expo ను ఈ రోజు మధ్యాహ్నం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషే రాజు సందర్శించారు ఈ సంద్భంగా ప్రదర్శన లో వున్న ఆక్వా ఉత్పత్తులను పరిశీలించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
