సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం జనసేన నేతలు భీమవరం నియోజకవర్గం లో కష్టాలలో ఉన్న పలువురికి సంఘీభావం ప్రకటించారు. , భీమవరం మండలంలో గల గూట్లపాడు గ్రామం లో ప్రమాదవశాత్తూ గాయపడిన బండి జాన్ బాబు అనే యువకుడిని మరియు లివర్ కంప్లైంట్ తో బాధపడుతున్న పచ్చిపాల అభిషేక్ పాల్ అనేయువకుడిని ( ఇతనికి వైద్య నిమిత్తం మండలి చైర్మెన్ కొయ్యే మోషేనురాజు 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి మంజూరు చేయించారు) తదుపరి గుట్లపాడు , దొంగపిండి,గొల్లవానితిప్ప ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామాల్లో అకాల మరణం పొందిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు అయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్ర శేఖర్ , బండి రమేష్ , మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలేంద్ర, జిల్లా కార్యదర్శి గోపీ,ఎంపీటీసీ లు తాతపూడి రాంబాబు ఆరేటి వాసు, తదితర జనసేన నేతలు ఉన్నారు. .
