సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు ఆదివారం ఉదయం నుండి 5 ఏళ్ళ లోపు చిన్నారులకు పల్స్ పోలియా చుక్కలు వేసే కార్యక్రమం ఉదృతంగా జరుగుతుంది. భీమవరం బ్యాంకు కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నేడు, ఆదివారం ఉదయం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్థానిక దుర్గాపురంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారులకు చుక్కల మందు వేసి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , మునిసిపల్ అధికారుల, ఉద్యోగుల పర్యవేక్షణ లో కార్యక్రమం వాడవాడలా జరుగుతుంది.
