సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు (చినబాబు) నేతృత్వంలో రాష్ట్ర PAC సభ్యులు కనకరాజు సూరి సమక్షంలో పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్విహించారు. మొదటి గా చినబాబు ఇంటి వద్ద కేక్ కటింగ్ తో వేడుకలు ప్రారంభించారు. అనంతరం రెస్ట్ హౌస్ రోడ్ లో కోడే రాజు ఆధ్వర్యంలో అభిమానులు బ్లడ్ క్యాంపు నిర్వహించారు. పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీచేశారు. తరువాత రాయలంలో జన సైనికులు ఆద్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక 19వ వార్డ్ లో మాజీ కౌన్సిలర్ మాగపు ప్రసాద్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ సుంకర రవి,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీను, మండల సెక్రటరీ కత్తుల,నీలెంద్ర , జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, ఎంపీటీసీ ఆరేటి వాసు, ముఖ్య నాయకులు ఇరింకి సూర్యారావు, మల్లినీడి బాబి,బండి రమేష్, మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు తదితర నేతలతో పాటు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *