సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కు భీమవరం ఎంత ప్రతిష్టాకరమో తెలుగు రాష్ట్రాలలో అందరికి తెలుసు.. అయితే భీమవరంలో నేడు, శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జనసేన 2 వర్గాలుగా నిర్వహించడం పెద్ద చర్చనీయాశం అయ్యింది. ఈసారి జనసేన వీరవాసరం జడ్పీ టిసి. గుండా జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో కొత్త్తగా భీమవరం జేపీ రోడ్డులో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం, పలు ప్రజా హిత కార్యక్రమాలు చెయ్యడం దానికి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు తో పాటు బీజేపీ రాష్ట్ర నేత పాక సత్యనారాయణ , చెన్ను శేషు, ఉండవల్లి రమేష్ తదితరులు, పలువురు జనసేన నేతలు పాల్గొనడం ‘పార్టీలో కొత్త పోకడ‘ పెద్ద చర్చకు దారితీసింది. ఇక నేటి ఉదయం స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న జనసేన ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు & నియోజకవర్గ ఇంచార్జి కొటికలపూడి గోవిందరావు కేక్ కట్ చేసి ప్రారంభించారు.రాష్ట్రంలో కష్టాలలో ఉన్న ప్రజలు కోసం సాహసోపేతంగా పోరాడుతున్న జనసేనాని కి మనమందరం అండగా పవన్ బాటలో నడవాలని పిలుపు నిచ్చారు తదుపరి అక్కడనుంచి భీమవరం శివారులోని రాయాలంలో పేదలకు దుస్తుల పంపిణీ, మహిళలకు మొక్కల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.అక్కడ నుంచి స్థానిక 3వ పట్టణం హౌసింగ్ బోర్డు లో పేద ప్రజలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం , అక్కడ నుంచి స్థానిక రెల్లి కాలనీ నందు ఉచిత కంటి పరీక్షలు, దుస్తుల పంపిణీ కార్యక్రమం మరియు రక్త దాన శిబిరాలు తదితర కార్య్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకరాజు సూరి , మల్లినీడి బాబి, పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్ర శేఖర్ తదితర పట్టణ, నేతలు వీరమహిళలు పాల్గొన్నారు.
