సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు మంగళవారం (ఈ నెల 20 వ తేదీన )జరగవలసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఈనెల 21వ తేదీకి మార్చడం జరిగింది. ఈ మేరకు భీమవరం లో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ మీడియా సమావేశంలో తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న సమావేశాలలో కొన్ని మార్పులు ఉన్నందున భీమవరం పర్యటన వాయిదా పడింది అని తెలియజేసారు.21 వ తారఖున జనసేన-తెలుగుదేశం పార్టీల ముఖ్య నాయకులతో అయన భేటీ అవుతారని తెలియజేసారు.కొంతమంది పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు నాన్ లోకల్ అని అనడం హాస్యాస్పదం అని పవన్ కళ్యాణ్ భీమవరం లోకల్ పర్సన్ అని ఆయన బల్ల గుద్ది చెప్పారు .ఈ సమావేశంలో జనసేన నేతలు జుత్తిగా నాగరాజు, బండి రమేష్ కుమార్,మోకా శ్రీనివాస్,ss గిరి ,దారపురెడ్డి త్రివిక్రమ్ , నాగిడి శ్రీనివాస్ ,,ఉండవల్లి శ్రీను,బన్ను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *