సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో భీమవరం, ఉండి, ఆకివీడు కు చెందిన తూర్పు కాపు సంఘం పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు ముల్లి నరసింహమూర్తి, జగ్గురోతు విజయకుమార్, ఉండి జెడ్పీ టీసీ రణస్తుల మహంకాళి, జిల్లా గ్రీవెన్స్‌సెల్ చైర్మన్ కరిమెరక రామచంద్రరావు, సరిపిడకల రామారావు (పెన్నాడ శ్రీను) మాట్లాడుతూ .. ఇటీవల తాము జనసేన కు మద్దతు తెలిపామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన వ్యాక్యలు నిజం కాదని , భీమవరంలో ఒక వ్యక్తి చంద్రశేఖర్ వెళ్లి పవన్ ను కలిస్తే, మా తూర్పు కాపులు అందరు ఆయనకు మద్దతు తెలపడమేమిటి? ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు ?అని ప్రశ్నించారు. తూర్పు కాపులు 98 శాతం సీఎం జగన్ వెంటే ఉన్నామని సృష్టం చేశారు.తూర్పు కాపులకు సంక్షేమం అందించడంతో పదవుల్లోకూడా సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని.. నాడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమను 10 జిల్లాల్లోబీసీలుగా గుర్తిస్తూ జీవో 62 జారీ చేసి మేలు చేశారన్నారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి తమకు ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. భీమవరంలో మరల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కచ్చితంగా ఓడించడానికే పనిచేస్తామన్నారు. భీమవరంలో వైసిపి తరఫున గ్రంధి శ్రీనివాస్ కే మా మద్దతు ఉంటుందని, పవన్ తూర్పు కాపుల మద్దతుపై ఎటువంటి భ్రమలు పెటుకోనక్కరలేదని అన్నారు.
