సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ ను మహిళలు చెప్పులు తో కొట్టి దహనం చెయ్యడం వెనుక, భీమవరంలో పవన్ మరోసారి పోటీకి దిగుతున్నాడనే దుగ్ధతో వాలంటీర్ల ముసుగులో అధికార వైసిపి నేతలు, కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతలు,వాలంటీర్లు పవన్ ఫై చేస్తున్న వ్యాఖ్యలకు, దిష్టిబొమ్మల దహనం కు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు పిలుపు మేరకు, నేడు, శుక్రవారం సాయంత్రం నుండి భీమవరం జనసేన పార్టీ వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంధర్భంగా వీరమహిళలు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక వాలంటీర్లను ఉసిగొల్పుతున్నారన్నారు. వాలంటీర్లను కించపరచడం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం కాదని, వాలంటీర్లకు మద్దతుగా పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణం, భీమవరం మండలం, వీరవాసరం మండలాలకు చెందిన జనసేన పార్టీ ఎంపిటీసిలు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.
