సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, గురువారం భీమవరం యూత్ క్లబ్ లో పశ్చిమగోదావరి జిల్లా బి.జె.పి ప్రజా పోరు కార్యక్రమం లో భాగంగా వీధి కార్నర్ సమావేశాలు, నిర్వహించారు. జిల్లాలో బీజేపీ పార్టీని ప్రతిష్టం చెయ్యడానికి చేప్పట్టవలసి న అవసరం ఉందని, ప్రధాని మోడీ చేస్తున్న ఎన్నో ప్రజా సంక్షేమపథకాలను, దేశ భద్రతా కు చేప్పట్టిన చర్యలను ప్రజలు దృష్టికి తీసుకొనివెళ్ళి వివరించాలని నేతలు చర్చించుకొన్నారు. తదుపరి రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాసవర్మ ,జిల్లా బిజెపి అధ్యక్షులు తాతాజీ మీడియాతో మాట్లాడుతూ.. బి.జె.పి ప్రజా పోరు కార్యక్రమం విజయవంతం అవుతుందని, ఈ జిల్లాలో గతం నుండి బీజేపీ కి మంచి పట్టు ఉందని, దానిని మరింత బలోపేతం చేస్తామని, ఇక ప్రధాని మోడి గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం తో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవ కార్యక్రమలు చేపడుతున్నామని ప్రకటించారు.
