సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి రీజియన్ పరిధి లో గల పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక సంఘాల రివ్యూ మీటింగ్ నేడు, బుధవారం భీమవరం పురపాలక సంఘం కార్యాలయం లో గౌరవ రీజినల్ డైరెక్టర్ సి. హెచ్. నాగ నరసింహ రావు అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పురపాలక సంఘాల మౌళిక సదుపాయాల అభివృద్ధి కొరకు ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూళ్ళు మెరుగైన రీతి గా ఉండాలని దిశానిర్దేశం చేయడమైనది. అలాగే పట్టణాలలో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని, ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిలు ఏర్పాటు, మరియు రోడ్ల పై గుంతలు త్వరితగతిన పూడ్చి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని ఇంజనీరింగ్ సిబ్బంది ని ఆదేశించారు. బిల్డింగ్ ప్లాన్లు పెండింగ్ లేకుండా మంజూరు ఉత్తర్వులు జారి చేసి, పట్టణాలలోని ఆక్రమణల పై దృష్టిసారించాలి అని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. నిషేదిత ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి, బయోడీగ్రేడబుల్ వస్తువులు మాత్రమే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో వచ్చు ఫిర్యాదులను నిర్ణీత సమయం లోగా పరిష్కరించాలని, దీనిలో నిర్లక్ష్యం గా ఉన్న వారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో భీమవరం మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్ర రెడ్డి తో పాటు జిల్లా లోని అన్ని పట్టణాల మునిసిపల్ కమీషనర్ లు, సెక్షన్ అధిపతులు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
