సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరణించిన రాష్ట్ర క్షత్రియ కార్పొ రేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ఆయన నివాసంలో నేటి శనివారం మధ్యాహ్నం సీఎం జగన్ స్వయంగా వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు. పాతపాటి సర్రాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. వెనువెంటనే భీమవరం శివారు లోని సర్రాజు నివాసానికి వెళ్లడంతో కోసం తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయల్దేరి వెళ్లారు., పాతపాటి సర్రాజు 1954లో కాళ్ల మం డలం జక్క వరం గ్రామం లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే గా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. తరువాత వైసీపీ లో పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెంట నడిచారు.
