సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం భీమవరం పట్టణం 18 వార్డులో పారిశుధ్య పరిస్థితులను మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి స్వయంగా తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు చోట్ల డ్రైన్స్ లో చెత్త నిల్వఉండటం గమనించి శానిటరీ సిబ్బంది తో వెంటనే శుభ్రం చేయించారు. ఆయన దృష్టికి వచ్చిన వార్డులలో లోతట్టు ప్రాంతాలైన రోడ్లను వెంటనే రైస్ చేసి నూతన రోడ్ లు నిర్మించేలాగా ఇంజనీరింగ్ వారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చెత్త సేకరించి వెహికల్స్ కు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా అందించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా సహకరించాలని సంబంధిత సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా పట్టణంలో అక్రమ కట్టడాలు జరగకుండా ఉండేలాగా చర్యలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సంబంధిత ప్లానింగ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు ఈ తనిఖీలలో కమిషనర్ తో పాటు డీఈ రహీం శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వారి సచివాల సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *