సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ స్థానిక 12 వార్డు నందు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి నేడు, మంగళవారం పారిశుద్యం పరిశీలన, అక్రమ కట్టడాలు ఫై తనిఖీ చేశారు ఈ తనిఖీలలో భాగంగా వార్డు సచివాల సిబ్బందితో మాట్లాడుతూ.. వార్డులలో గల చెత్తను ఇంటింటికి గవర్నమెంట్ వారు అందజేసిన డస్ట్ బిన్స్ ద్వారా తడి చెత్త పొడి చెత్త విడిగా అందజేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలలో సిల్టును తొలగించాలని, అనధికారికంగా చెత్త వేస్తున్న వారికీ, మురుగు డ్రైన్స్ ఆక్రమించినవారికి నోటీసులు జారీ చేయవలసిందిగా సానిటరీ సిబ్బందికి మరియు వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వార్డు పరిధిలో అనధికార కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేసేలాగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడుతూ ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నచో వెంటనే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డ్రైనేజ్ మరియు రోడ్లను రైస్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు.. కమిషనర్ తో పాటు ఈ తనిఖీ లో సానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈలు మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
