సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పారిశుధ్య పనులను ప్రతి రోజు ఉదయం రోజుకో వార్డు చప్పున మునిసిపల్ కమిషనర్ పరిశీలించి ప్రజారోగ్యం కోసం సత్వర చర్యలు చేపడుతున్నారు.నేడు, గురువారం స్థానిక 31 వార్డు బలసమూడి నందు కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి తనిఖీ నిర్వహించారు. స్థానిక ప్రజలను పారిశుధ్య పనుల తీరును అడిగి తెలుసుకొన్నారు. తదుపరి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు డ్రైనేజీలో సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడైనా సరే బ్లాక్ అయిన చో వెంటనే క్లియర్ చేయవలసిందిగా కమిషన్ ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎంహెచ్ఓ ఇంచార్జ్ సోమశేఖర్ , సెంట్రల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు మరియు వార్డ్ సచివాలయం సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *