సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్లో ఈ వేసవిలో అకాల వర్షాలు రైతులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. గత రాత్రి భీమవరంలో గంటల పాటు ఉరుములు మెరుపులు భారీ పిడుగులతో కురిసిన వర్షానికి నేడు, సోమవారం కూడా పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయంలోనే ఉన్నాయి. గత రాత్రి పట్టణంలో రాత్రి 10 గంటల నుండి ఒంటిగంట వరకు కరెంట్ సరఫరా కూడా నిలచిపోయింది. అనేక చోట్ల పిడుగులా దెబ్బకు ట్రాన్స్ ఫార్మ్ లు దెబ్బతిన్నాయి. భీమవరం పరిసర ప్రాంతాలలో కాయలు రాలిపోయి మామిడి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక మొగల్తూరు ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువ ఉంది. తాజాగా వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rain Alerst) పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
