సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పిల్లల హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించి భీమవరం లో ఉచిత వైద్య శిబిరం ను రేపు, మంగళవారం (ఈనెల 27వ తేదీ)సాయంత్రం స్థానిక మేంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం కన్వీనర్ వి. రాధాకృష్ణ, వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు లు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ కె.విక్రమ్ (ఇంటర్ వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్) పిల్లలను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తారన్నారు . 15 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులకు మెడికల్ క్యాంపులో ఉచిత పరీక్షలు, చికిత్స కు వైద్య సహాయం అందిస్తారని తెలిపారు… వైద్య శిబిరంనకు వచ్చేవారు ముందుగా తమ పేరు నమోదు కొరకు 62812 25145 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చునన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *