సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం (Bhimavaram)లో గత గురువారం, సాయంత్రం ఎప్పుడు రద్దీగా ఉండే స్థానిక పోలీస్ బొమ్మ సెంటర్ లో మద్యం మత్తులో ఉన్న యువకుల గ్యాంగ్ అటుగా వెళుతున్న ఒక కాలేజీ బస్ ను ఆపి ఆ బస్సు (College Bus)లో వెళుతున్న ఓ విద్యార్థి పై యువకులు ఒక్కసారిగా దాడి చేసి కొట్టారు. తదుపరి యువకులు నడిరోడ్డుపై వెకిలి చేష్టలు.. డ్యాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి రోడ్డు ఫై వెళుతున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల రోడ్లపై, కొన్ని సందుల చివర రాత్రి పూటలా తాగేసి కూర్చుంటున్న యువకుల వికృత చేష్టలను అరికట్టాలని రాత్రులు పోలీస్ లు పెట్రోలింగ్ సందులలో కూడా చేస్తే ఈ తరహా గ్యాంగుల ను పట్టుకోవచ్చునని ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానికులు కూడా యూత్ గ్యాంగ్ లపై పిర్యాదు ఇచ్చే సాహసం చెయ్యడం లేదు. ఏ రాజకీయ పార్టీ వారైనా సరే రాజకీయా నేతలు కూడా ఇటువంటి యూత్ గ్యాంగ్ లను దూరంగా పెడితే మంచిది
