సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాసుపత్రి రోడ్డులోని పురాతన శ్రీసీతారామలింగేశ్వరస్వామివారి దేవాలయ పునఃప్రతిష్టా మహోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా నేడు, శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులచే పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం 11.52 నిమిషాలకు శ్రీసీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ట, శ్రీసీతారామ లింగేశ్వరస్వామివారి రామపంచాయతనం సమేత రాజ్యలక్ష్మి, రామా సత్యనారాయణస్వామి, ఆంజనేయ, ధ్వజ స్థంభం పరిహార దేవతా విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. పురాతన దేవాలయాన్ని పునః ప్రతిష్ఠ జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారయణ మూర్తి, నల్లం చిట్టిబాబు,మరియు చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, ఆయా దేవాలయాల ఈవోలు సిబ్బంది పాల్గొన్నారు.ఈ ఆలయం పునర్నిర్మాణానికి అనేక మంది దాతలతో పాటు గతంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కీలక కృషి చెయ్యడంతో పాటు వారి కుటుంబం లక్షలాది రూపాయలు విరాళం ఇవ్వడం గమనార్హం
