సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ముఖ్య అతిధిగా పాల్గొని నేడు, సోమవారం అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 47 మంది దాతల సహకారంతో పట్టణంలోని 219 మంది విద్యార్థులకు రూ 10 లక్షల 95 వేలు స్కాలర్ షిప్స్ లను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, ఉన్నత చదువుకు ప్రతిభకు పేదరికం అడ్డుకాదని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో విద్యకు దూరంగా విద్యార్థులు ఉంటే తమ దృష్టికి వస్తే వారి ఉన్నత విద్యకు సహకారం అందిస్తామని అన్నారు. అనంతరం ఒక ఎంఎంబిఎస్, ఒక బిడిఎస్, ఒక సీఏ, ఒక ఎం టెక్, ఒక ఎంపిటి, ఇద్దరు బి ఫార్మసి, అరుగురు పిజి, 80 మంది బి టెక్, 4 గురు డిప్లొమా, 7 గురు డిగ్రీ, 5 గురు ఐటిఐ విద్యార్థులకు మొత్తం రూ 10 లక్షల 82 వేలు, 110 మంది జెఎల్ బి హైస్కూల్ విద్యార్థులకు రూ 13,750 పీజు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, కార్యదర్శు .గాదిరాజు సుబ్బరాజు, సుబ్రహ్మణ్య రాజు, ఇందుకూరి రామలింగరాజు, వేగేశ్న రమణరాజు, జి సత్యనారాయణ రాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, ఝాన్సీ, కనుమూరి సత్యనారాయణ రాజు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *