సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ​పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్ లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ ఆధ్వర్యంలో ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీర పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు కీలక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విరామం లేకుండా నిరంతరం పనిచేసే పోలీస్ వ్యవస్థకు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటామన్నారు.పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని అమరులైన పోలీస్ కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయ హామీ హామీ ఇచ్చి సంబంధిత పోలీస్ కుటుంబాలకు గౌరవ పునస్కారాలు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కోత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ఇతర ఉన్నతాధికారులు,అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *