సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికి గుర్తుకువచ్చేది భీమవరం.. అక్కడ శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు తోడు తిరునాళ్లను తలపించే కోడి పందాలు..ఇది తరతరాలుగా సంక్రాంతి సంప్రదాయం అని ఇక్కడి వారు భావిస్తారు. ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే బంధువులు ప్రముఖులు వారికీ విందు వినోదాలతో పాటు ఆ 3 రోజులు కోడిపందాలు చూడటం అదో పండుగ మజా .. ఎప్పటిలానే సంక్రాంతి రోజుల్లో కోడిపందేలపై ఉక్కు పాదం మోపుతాం .. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ.. పోలీసు అధికారులు చేసే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సంప్రదాయం చాటున ఈసారి కూడా కోడిపందాలు బరులకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈసారి వెంప తో పాటు పాలకోడేరు వీరవాసరం పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున కోళ్లు తలపడతాయని భావిస్తున్నారు. ఈ పండుగ రోజులలో భీమవరం ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా సహకరించుకొంటారని అందరికి తెలిసిందే. ఇక చోటా మోట నేతల ఆధ్వర్యంలో కోడి పందాల బరులుకు, డింకీ పందాలకు పట్టణంలోని 3 టౌన్ శివారు ప్రాంతలతో పాటు , పెదగరువు, పాలకోడేరు, ఉండి, కాళ్ల మండలాల్లోని పలు ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. కోడి పందాలతో పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ లు కు సన్నాహాలలో ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మాత్రం కోడి పందాల, జూదశాలల నిర్వహణ ఫై కఠిన ఆంక్షలు, చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చెయ్యడం గమనార్హం,
