సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దొరికితే దొంగలు.. లేదంటే దొరలు.. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఆర్ధికంగా బలమైన ప్రాంతంగా తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచిన భీమవరంలో మున్సిపల్‌ కమిషనర్‌, నివాసంలోను సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించడంతో అక్రమ ఆస్తులు గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి భాగోతాలపై చర్చ సాగుతోంది. అయితే మున్సిపల్ RI ఎస్‌.కృష్ణమోహనరావు ఇంటిపై కూడా ఏసీబీ దాడులు చెయ్యడంతో భీమవరంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులలో ఈ ప్రకంపనలు మాములుగా లేవు.. అయితే ఏసీబీ దాడులలో భీమవరం మున్సిపల్ కమిషనర్‌ ఎస్ శివరామ కృష్ణ పై మరో 3రోజులలోపు ? విచారణ పూర్తీ అయ్యాక అన్ని అక్రమ ఆస్తులు, అక్రమ ఆదాయాలు గుర్తించి తగు చర్యలు తీసుకొనే అవకాసమ్ ఉంది. భీమవరం కి కొత్త మునిసిపల్ కమిషనర్ వచ్చే అవకాశం స్వష్టంగా ఉంది. నేడు, గురువారం విజయవాడ లో ఆయన నివాసం వద్ద ఇంకా తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. విజయవాడలోని బ్యాంకు లాకర్లు లో ఆయనకు చెందిన విలువైన పత్రాలు స్వాధీనం చేసుకొనే దిశగా ఏసీబీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. నిన్న బుధవారం రాత్రి వరకు 9 ప్రాంతాలలో జరిగిన సోదాలలో భీమవరం, పాలకొల్లు, బాపట్ల, తణుకు మరియు విజయవాడ లోని సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. సోదాలలో గుర్తించిన ఆస్తుల వివరాలు:పాలంగి గ్రామం, ఉండ్రాజవరం మండలం లో వ్యవసాయ భూమి 3.03ఎకరాలు.,భీమవరం లో ఒక G+1 భవనo.,తణుకు లో రెండు G+1 భవనాలు.,పాలకొల్లు లో ఒక G+1 భవనo మరియు ఒక ఖాళీ నివాస స్తలము.,విజయవాడ లో రెండు అపార్ట్మెంట్.ఇంట్లో 20 లక్షల నగదు, అరకేజీ పైగా బంగారం,రెండు కార్లు ( 4 కారులు ?) మరియు ఒక ద్విచక్ర వాహనం.విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న వాటి విలువ అధికారికంగా 6 కోట్ల ఫై మాటే ఉండవచ్చునని అయితే అనధికారంగా ఇంకా ఎన్నో రేట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లు సోదలను కొనసాగిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *