సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో అన్ని ప్రధాన రోడ్డులు కిలోమీటర్ల మేర ప్రతి 20 అడుగులకు, రోడ్లకు ఎడాపెడా రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ప్లెక్సీలు బ్యానర్లుతో పండుగ సందడి నెలకొంది. ఈ నెల 28వ తేదీన ఆయన పుట్టినరోజు కావడం ఆ శుభాకాంక్షలు తో పాటు ఆయన నివాసం ఉండే స్థానిక గునుపూడి సెంటర్ లో 1000 కేజీల బరువుతో Dr BR అంబెడ్కర్ భారీ కాంస్య విగ్రహం ఏర్పటు చేస్తుండటం, దానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర స్థాయిలో మంత్రులు కీలకనేతలు హాజరు అవుతుండటంతో వైసిపి అభిమానులు ,నేతలు ఈ బ్యానేర్స్ సందడి చేస్తున్నారు. ఇక నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి లాల చెరువు సెంటర్లో నిర్వహించిన ర్యాలీ ని శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా దేశం అభివృద్ధి చెందుతుందoటే అందుకు Dr BR అంబెడ్కర్ వ్రాసిన రాజ్యాంగమే కారణమని ఆయన అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ప్రజలను నేతలను కోరారు.
