సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మరల భీమవరం పట్టణంలో సినిమా హాళ్లలో సినిమాల ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. నిన్న ఆదివారం సాయంత్రం నుండి మొదటగా నటరాజ్ థియేటర్ లో ..శ్యాం సింగరాయి సినిమా ప్రభుత్వం నిబంధనల మేరకు తగ్గింపు ధరలతో టికెట్స్ అమ్మకంతో ప్రదర్శన ప్రారంభము కావడం జరిగింది. నేటి సోమవారం నుండి మరిన్నిథియేటర్స్ లో సినిమాలు ప్రదర్శించే అవకాశాలు కనపడుతున్నాయి..ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళపై లైసెన్స్, నిర్వహణ తీరుపై అధికారులు నిఘా పెట్టిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లో నరసాపురం డివిజన్ పరిధిలో గత శుక్రవారం అధికారులు ఒకేసారి 35 థియేటర్స్ తనిఖీలు చేప్పట్టడం దానిలో భాగంగా జిల్లా లో అత్యధిక సినిమా హాళ్లు ఉన్న భీమవరం లోని సినిమా ధియేటర్లలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ ఎమ్మార్వో రమణారావు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేసి దీనిలో ఒక్క మల్టి ఫ్లెక్స్ లో 4 థియేటర్ల మినహా మిగతా అన్ని థియేటర్స్ లోయజమాన్యం వారి బి ఫారం లైసెన్స్, అధిక టికెట్ రేట్లు, ఇతర నిబంధనల అమలులో లోపాలు గుర్తించిన సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ వాటిని తాత్కాలికంగా మూసివేయించడం జరిగింది. తదుపరి స్థానిక థియేటర్స్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇటు అధికారులు, అటు మంత్రి పేర్ని నాని తో సంప్రదింపులు జరిపిన దరిమిలా.. నిబంధనలు పాటిస్తామని థియేటర్స్ యజమానులు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి పరిస్థితి ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తుంది.
