సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ కాన్సర్ నిర్ములన దినోత్సవం సందర్భముగా నేడు, ఆదివారం భీమవరం చినమీరం జేపీ రోడ్డు నుండి డీఎన్ ఆర్ కళాశాల గ్రౌండ్ వరకు 3కిలోమీటర్లు మేర 3 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా విద్యార్థులు టీచర్లు స్వచ్చంద సేవ సేవకులు, డాక్టర్స్ తో పాటు ‘భీమవరం కాఫీ క్లబ్ సభ్యులు‘ విశేషంగా పాల్గొని పెద్ద ఎత్తున రోడ్డు ఫై కాన్సర్ ను తరిమికొట్టాలి అని నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.. తదుపరి జరిగిన సమావేశంలో ప్రముఖ డాక్టర్స్ మాట్లాడుతూ.. భారతదేశంలో పెరిగిపోతున్న పలు రకాల కాన్సర్ కేసుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని ముందే గుర్తించి ఎలా రక్షణ పొందవచ్చు..ప్రతి మనిషి ప్రతి రోజు ఆరోగ్యానికి పాటించవలసిన చిన్న చిన్న చిట్కాలు వివరిస్తూ..కాన్సర్ కు వైద్య చికిత్సలలో వస్తున్నా ఆధునిక మార్పులు గురించి వివరించారు.
