సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణం వివాదం మరింత రాజుకొంటుంది. స్థానిక భీమవరం పట్టణంలోని ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో జరిగిన అఖిల పార్టీ మరియు స్థానిక స్వచ్చంద సంస్థల రౌండ్ టేబుల్ సమావేశంలో లెఫ్ట్ పార్టీల నేతలు పలువురు భీమవరం నుండి కలెక్టరేట్ ను తరలింపు కు ససేమిరా అన్నారు. ఇక భీమవరం వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు చినమిల్లి రాయుడు మరియు కామన నాగేశ్వర రావు, వేండ్ర వెంకట స్వామి తదితరులు తీవ్ర స్థాయిలో అభ్యన్తరం వ్యక్తం చేసారు. కలెక్టరేట్ ను గత వైసీపీ ప్రభుత్వం G.Oలో కేటాయించిన మార్కెట్ యార్డ్ స్థలం నుండి వేరే ప్రాంతానికి తరలించడానికి ఇటు ఎమ్మెల్యే అంజిబాబు అటు ఉండి ఎమ్మెల్యే రఘురామా ప్రతిపాదనలు ఫై తీవ్ర అభ్యన్తరాలు వ్యక్తం చేసారు. గత సీఎం జగన్ ప్రజా సౌలభ్యం కోసం సాహసోపేతంగా జిల్లాల విభజనలు చేసిన తరువాత నూతన పశ్చిమ గోదావరి జిల్లా లో ఇతర నియోజకవర్గాల నుండి ఎన్నో ప్రతిపాదనలు, అభ్యన్తరాలు వచ్చిన వాటిని కాదని జిల్లాకు నడిబొడ్డున అందరికి ఉపయోగపడేలా భీమవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆఘమేఘాల మీద అద్దె భవనాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారని.. తదుపరి శాశ్వత భవనాల కోసం మార్కెట్ యార్డ్ లో స్థలాన్ని కేటాయించి దానికి నిధులు కూడా కేటాయించారని అటువంటిది ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం లో .. గత 15 నెలలుగా అక్కడ కలెక్టర్ కార్యాలయం నిర్మించకుండా, ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త వివాదాలకు తేరా లేపి ఆఖరికి స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వేరే ప్రాంతాలకు తరలిస్తామంటే ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *