సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్ అస్మి భీమవరంలో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..భీమవరం లోని స్థానిక వంశీకృష్ణనగర్‌లో ఈ నెల 23న రాత్రి వేగేశ్న రంగరాజు ఇంటి వద్ద భారీ దొంగతనం ప్రయత్నం విఫలమైందని, గంపల ఆనందబాబు అనే వ్యక్తి తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన వ్యాపార నేపథ్యంలో. స్థానికంగా ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి ప్రయత్నం చేస్తారని, 12 మంది సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ రెండు కార్లు, భారీ ఆయుధాలు, మంకీ క్యాపులు, గ్లౌజులు ధరించి .వేగేశ్న రంగరాజు ఇంటి లో చొరబడటానికి విఫల యత్నం చేసారని.. అయితే , వాచ్‌మన్ కేకలతో గ్యాంగ్ అక్కడి నుంచి పరారీ అయ్యారని, అంతకుముందు రెండు సార్లు రెక్కీ చేసిన గ్యాంగ్, అదే ఏరియాలో మరో దొంగతనానికి ప్రయత్నించేందుకు ఈ నెల 27న తిరిగి భీమవరం వచ్చిందని, టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారని, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
