సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి బయలు దేరిన పాతికేళ్ళు నిండని ఆ అందమైన జంట ప్రేమికులు హైదరాబాద్ లో విగత జీవులుగా మారారు. హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీ లో గత సోమవారం సంచలనం రేకిత్తించిన ఈ జంట ఆత్మహత్య మూలాలు భీమవరం నుండి ప్రారంభమయ్యని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ ఒకే గదిలో వేర్వేరు పద్ధతుల్లో బలవన్మరణానికి పాల్ప డ్డారు. నేడు, మంగళవారం వారి మృత దేహాలకు పోస్ట్ మర్డన్ నిర్వహించనున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ప్రకారం.. భీమవరం సమీపం లోని గొల్లవానితిప్ప కు చెందిన ఆకుల శ్యామ్ (24), పోతుల జ్యోతి (22) ఇద్దరు సమీప బంధువులు.. ప్రేమలో ఉన్నారు. అయితే శ్యామ్ బైబిల్ బోధనలో శిక్షణ తీసుకుంటున్నారు. అప్పటికే వివాహిత అయిన భర్త తో విడాకులు తీసుకొన్న జ్యోతి గత నెల 26న కూకట్పల్లికి వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా రు. అయితే ఏమి జరిగిందో ఏమిటో? వీరిరువురు శ్యామ్ మిత్రుడు , భీమవరానికి చెందిన కృష్ణ పెళ్లి వేడుకలలో పాల్గొనడానికి అతని ఊరు వెళ్లగా కేపీహెచ్బీకాలనీ లో అతని రూమ్ తాళాలు తీసుకోని (ఏడో ఫేజ్లోని ఎల్ఐజీ 8లో ఓ గదిలో) జ్యో తిని తీసుకుని శ్యామ్ ఆ గదికి వెళ్లారు. తదుపరి అక్కడే ఆత్మహత్య చేసుకొన్నారు. నిన్న సోమవారం ఉదయం కృ ష్ణ గది నుంచి దుర్వా సన రావడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దానితో ఫ్యాను కు ఉరివేసుకున్న శ్యాం మృత దేహం, నిద్రమాత్రలు మింగిన జ్యోతి మృతదేహం లభ్యమయ్యాయి. ఇంతకు ముందు కూడా అనేకసార్లు వీరిద్దరూ ఆ గదికి వచ్చి వెళ్లినట్లుగా స్థానికులు చెప్పారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఆత్మహత్య చేసుకొన్నారా ? లేక ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉం టుందా? అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. మొత్తానికి గొల్లవాని తిప్పా గ్రామంలో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నిండుకొంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *