సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ తాజగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనధికార భవనముల క్రమబద్ధీకరణ కొరకు G.O.Ms.No.225 MA & UD dept., Dt. 12-11-2025 ఆదేశాలు జారీచేసియున్నారు. ఈ మేరకు భీమవరం పట్టణ ప్రజలు మీ యొక్క భవనములను ది.31-08-2025 నకు ముందు అనుమతి పొంది ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన, ప్లాను అనుమతి పొందకుండా నిర్మించిన యెడల మీ యొక్క భవనములను క్రమబద్ధీకరించవలసినదిగా తెలియజేయడ మైనది. మీ యొక్క దరఖాస్తును ఆన్లైన్ (bps.ap.gov.in) ద్వారా లైసెన్సు టెక్నికల్ పర్సన్స్ ద్వారా పొందుపరిచి క్రమబద్ధీకరించు కొనవలసినదిగా తెలియజేయుడమైనది. లేని పక్షంలో మీ యొక్క భవనములపై 31-08-2025 తరువాతచట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయుడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *